E-PAPER

జడ్పీటీసీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న దువ్వాడ సంతోష్ కుమార్

పలాస, శ్రీకాకుళం జిల్లా: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలాస మండల జడ్పీటీసీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దువ్వాడ సంతోష్ కుమార్ సోమవారం అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చేతుల మీదుగా ఆయన ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా దువ్వాడ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పలాస మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

Y7 News Telugu | పలాస, శ్రీకాకుళం జిల్లా

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!