అధికారులందరూ శాఖల వారీగా తాజా నివేదికలతో హాజరు కావాలని ఎంపీడీఓ కార్యాలయం ఆదేశం
కరకగూడెం, నవంబర్ 11 (వై 7 తెలుగు న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని భట్టుపల్లి రైతు వేదికలో గురువారం (నవంబర్ 12) మండల స్థాయి అధికారుల సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన తాజా నివేదికలను సిద్ధం చేసుకోవాలని ఎంపీడీఓ కార్యాలయం సూచించింది. సంబంధిత నివేదికలను మూడు ప్రతులుగా తయారు చేసి, గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో రెండు ప్రతులను సమర్పించాలని, మరో ప్రతిని తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది.
అలాగే మధ్యాహ్నం 1:30 గంటలకు భట్టుపల్లి రైతు వేదికలో జరిగే సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
– వై 7 తెలుగు న్యూస్
కరకగూడెం రిపోర్టర్: దిలీప్ కుమార్








