పలాస: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలాస మండల జడ్పీటీసీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దువ్వాడ సంతోష్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ను కేంద్రమంత్రి శాలువాతో సత్కరించి, ఘనంగా అభినందించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పలాస మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.కేంద్రమంత్రి అభినందనలతో సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
Post Views: 24








