వై 7 న్యూస్ పలాస
మందస మండలం పెద్ద కేసుపురం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన పిడుగు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదం కుటుంబాన్ని పూర్తిగా కుదేలు చేసింది.ఇప్పటికే ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో కుటుంబం ఆర్థికంగా, భావోద్వేగంగా తీవ్ర కష్టాల్లో ఉంది. తల్లి కృష్ణకుమారి (38), చెల్లి యోగేశ్వరి (15)తో కలిసి నికిత (18) జీవనం సాగిస్తోంది. ఇలాంటి సమయంలో పిడుగు రూపంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడంతో నికిత ఒక్కసారిగా అనాథగా మారింది.సోమవారం రోజున తన తల్లి, చెల్లికి నికిత ఒకేసారి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కన్నీళ్లు పెట్టించింది. చిన్న వయసులోనే ఇంతటి విషాదాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలిచిన నికితను చూసి గ్రామస్థులు భావోద్వేగానికి లోనయ్యారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నికితకు అండగా నిలవాలని గ్రామ పెద్దలు, స్థానికులు కోరుతున్నారు








