E-PAPER

సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో Allu Arjun అభిమానులు ముందంజ… భద్రాచలం సీఐ ప్రశంసలు

భద్రాచలం:
సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో అల్లు అర్జున్ అభిమానులు ముందుండటం ప్రశంసనీయమని భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు తెలిపారు.
భద్రాచలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ఆ అసోసియేషన్గ ఎడ్వర్ర్భాయంలో గర్భాశయ కర్కాటక వ్యాధి నివారణకు సంబంధించిన టీకా పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల్లో గర్భాశయ సంబంధిత కర్కాటక వ్యాధి నివారణ కోసం ఈ టీకా ఎంత అవసరమో తెలియజేస్తూ పోస్టర్‌ను సీఐ నాగరాజు ఆవిష్కరించారు.9 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు, మహిళలు తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది పోస్టర్లను ఆవిష్కరించి, ఈ టీకా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని, ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చందు సాధనపల్లి, ఉపాధ్యక్షుడు కొప్పుల రాకేష్, రాజేష్, సాయినాథ్, నందు, సాధిక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News