వై 7 న్యూస్ పలాస
కాశిబుగ్గ: మహిళల భద్రతకు కీలకమైన శక్తి యాప్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. Kasibugga బస్ స్టాండ్ సమీపంలోని రామాలయం వద్ద శక్తి టీం-5 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా శక్తి టీం ఇంచార్జీ ఏఎస్ఐ బైరేగి వాసుదేవరావు, మోహిని మాట్లాడుతూ ప్రయాణికులు, భక్తులు పాటించాల్సిన భద్రతా నియమాలను వివరించారు. ముఖ్యంగా రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద పరిస్థితులు గమనించినప్పుడు వెంటనే సమాచారాన్ని అందించడం వంటి అంశాలను వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో ప్రదర్శన ద్వారా తెలియజేశారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ సేవలు, స్పందన విధానం గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు, ప్రయాణికులు తమ భద్రతపై మరింత చైతన్యం పొందాలని నిర్వాహకులు సూచించారు.
Post Views: 9








