వై 7 న్యూస్ పలాస ;
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పనులను టీడీపీ నేత, ఏపిటిపిసి చైర్మన్ వజ్జ బాబూరావు గురువారం సాయంత్రం పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని గుత్తేదారులకు సూచించారు.ఎలాంటి లోపాలు లేకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
Post Views: 12








