వై 7 న్యూస్ పలాస ;
పలాస మండలం చిన్న గురుదాసుపురం గ్రామంలో గురువారం (26-03-2026) కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ SI ఆర్. నరసింహమూర్తి మరియు సిబ్బంది గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ జంక్షన్ వద్ద గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో నారీ శక్తి, కొత్త చట్టాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇంకా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, అత్యవసర సేవల కోసం 112 నంబర్ వినియోగంపై కూడా వివరించారు.








