E-PAPER

ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి

వై 7 న్యూస్ పలాస

ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే బెందలం అశోక్ ఆదివాసి వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ రైతుకూలీ సంఘం రాష్ట్ర నేత కోనేరు రమేష్, గిరిజన శక్తి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సవర నరసింహరావు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు శుక్రవారం పలాసలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తన చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆదివాసుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అసహ్యకరమని విమర్శించారు.ఎమ్మెల్యే వెంటనే గిరిజనులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన సంఘాలు, రైతుకూలీ సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను గుర్తుంచుకుని ప్రజలతో గౌరవంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News