వై 7 న్యూస్ పలాస ;
త్రేతాయుగంలో శ్రీరాముడికి వానరసేన అందించిన సహకారం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంజనేయుడు చూపిన ధైర్యసాహసాలు రామాయణంలో చిరస్మరణీయంగా నిలిచాయి. అలాంటి ఆధ్యాత్మిక సందర్భాన్ని గుర్తుచేస్తూ శ్రీరామనవమి వేడుకల సమయంలో మందస మండలంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
మందస సమీపంలోని జగతి కేసుపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నగరి సంకీర్తన, సీతారాముల కళ్యాణం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్న వేళ ఓ వానరం కాషాయ వర్ణం కలిగిన వస్త్రాన్ని చేత పట్టుకుని గ్రామంలోని పలు వీధుల్లో సంచరిస్తూ భక్తులను ఆకట్టుకుంది.
ఆ వానరం ప్రవర్తనను చూసిన స్థానికులు, భక్తులు ఆశ్చర్యంతో పాటు భక్తి భావంతో గమనించారు. కొందరు దీనిని ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారగా, శ్రీరామనవమి వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








