వై 7 న్యూస్ పలాస
పలాస 10వ వార్డు మాజీ కౌన్సిలర్ సర్వాన గీతారవి భావోద్వేగ ప్రకటన చేశారు.తనకు కౌన్సిలర్‌గా అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు, అత్యధిక మెజారిటీతో గెలిపించిన 10వ వార్డు ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానన్నారు.
కరోనా సమయంలో నిరుపేదలకు అన్నం అందించడం నుంచి, వార్డు అభివృద్ధి పనులు, పవర్ బోర్లు, కల్వర్టులు, పాత బావుల పునరుద్ధరణ, రహదారి సమస్యల పరిష్కారం వరకు అనేక సేవలు చేశానని తెలిపారు.హుదూద్, తీతిలి తుఫాన్ల బాధితులకు సహాయం అందించామని, జగనన్న పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేశామని పేర్కొన్నారు.
తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డట్లయితే క్షమించాలని కోరుతూ, ఇకముందు కూడా ప్రజల సమస్యలపై స్పందిస్తూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
చివరిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చైర్మన్ బల్ల గిరిబాబు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 51









