వై7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ రైల్వే స్టేషన్ రోడ్‌లో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రయాణికుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
వివరాల ప్రకారం, ఆ మార్గంలో వెళ్తున్న ఓ పాసింజర్‌ను దుండగులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Post Views: 14









