వై 7 న్యూస్ ఖమ్మం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లూరుపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న భవాని (25) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో, జీవితంలో స్థిరపడలేనేమో అన్న ఆవేదనకు గురైన భవాని… బుధవారం గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకుంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 19









