మణుగూరు :
మణుగూరు అంబేద్కర్ సెంటర్ పరిధిలోని రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ లోక్‌సభ సభ్యురాలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శౌర్యం, ధైర్యం, సాహసాలకు ప్రతీకగా నిలిచిన ప్రియాంక గాంధీ సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. మహిళల సాధికారత, ప్రజాసేవలో ఆమె పోషిస్తున్న పాత్రను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ, మహిళా సీనియర్ నాయకులు ఎండీ షబానా, కోరి శ్యామల, డేరంగుల సుజాత, కన్నాపురం వసంత, రెడ్డి బోయిన రేణుక, డాకురి సౌజన్య, బడిశా పార్వతి, సీనియర్ నాయకులు ఎండీ షరీఫ్, సత్యనారాయణ (సోషల్ మీడియా) తదితరులు పాల్గొన్నారు.
Post Views: 92









