E-PAPER

గుండ అప్పల సూర్యనారాయణ మృతి – సమాజానికి తీరని లోటు

వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిలర్‌గా తన రాజ
కీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుండ అప్పల సూర్యనారాయణ, అనంతరం సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, రెండు సార్లు మంత్రిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. నిజాయితీ, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావంతో మచ్చలేని ప్రజాప్రతినిధిగా ఆయన చిరస్మరణీయులు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు సార్లు మంత్రి పదవులు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందిన ఆయన, నేటి తరానికి ఆదర్శప్రాయులు.
ఇలాంటి విశిష్ట నేత మరణం రాష్ట్ర రాజకీయాలకు, సమాజానికి తీరని లోటుగా భావించాలి. ఆయన సేవలు, ప్రజలతో కలిసిమెలిసి నడిచిన రాజకీయ జీవితం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News