E-PAPER

రథసప్తమి ఉత్సవాలకు అంకురార్పణ

వై 7 న్యూస్ | పలాస

సూర్యభగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు.
శుక్రవారం ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన కర్టన్ రైజర్ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు.
ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News