పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో కె. వసంతకుమార్ శుక్రవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ సర్వేలపై సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం సచివాలయంలోని రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది హాజరు పట్టికను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వైకుంఠరావు, ఉమాపతి, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 59









