వై7 న్యూస్ పలాస
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలతో పాటు మహిళల విద్యాభివృద్ధికి అంకితమైన తొలి తరం మహిళా ఉద్యమకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
స్థానిక మదర్ థెరీసా హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళల విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలను నేటి తరం విద్యార్థులు ఆచరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 106









