వై7 న్యూస్ పలాస
మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు ఇచ్చాపురంలో ముగియనుంది.
ఈ సందర్భంగా ఇచ్చాపురం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జీ మంత్రి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.
Post Views: 63









