వై7 న్యూస్ పలాస
పలాస టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పలాస నియోజకవర్గానికి చెందిన వజ్రపుకొత్తూరు మండలంలోని మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్న 30 మందిని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పిస్తూ అప్‌గ్రేడేషన్ ఆర్డర్లను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు సేవాభావంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీల పాత్ర కీలకమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 63









