పలాస;
పలాస మండలం రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిహ్నంతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే గౌతు శిరీష పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏవైనా తప్పులు, పారపాట్లు ఉన్నట్లయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సంబంధిత రైతులు స్వర్ణ గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేస్తే, వారం రోజుల్లోనే తప్పులను సరిచేస్తామని తెలిపారు.
రైతుల హక్కులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని, భూమి సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.
Post Views: 86









