– పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు;
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మటన్ మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మటన్ మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణంతో వ్యాపారులు, వినియోగదారులు, ప్రజలకు రాకపోకలు మరింత సులభంగా మారతాయని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, RWS ఏఈ అరుంధతి, మైనారిటీ అధ్యక్షులు రహీం పాషా, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, 14 టైర్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు









