E-PAPER

మధిరలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 69వ శాఖ ప్రారంభం

ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త కోనా జనార్దన్ రావు

మధిర :
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా సేవలను విస్తరిస్తున్న గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మధిరలో తన 69వ శాఖను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోనా జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మధిర మాజీ చైర్మన్ శ్రీ రంగ హనుమంత రావు, ఫిజిషియన్ & సర్జన్ డా. వాసిరెడ్డి రామనాధం, బ్యాంకు పాలక వర్గ సభ్యులు, పుర ప్రముఖులు, సహకార శాఖ అధికారులు, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని బ్యాంకు వివిధ విభాగాలను ప్రారంభించారు.
రూ.3858 కోట్ల వ్యాపారంతో మల్టీస్టేట్ బ్యాంకుగా ఎదిగిన గాయత్రి
ఈ సందర్భంగా శ్రీ కోనా జనార్దన్ రావు మాట్లాడుతూ, జగిత్యాల కేంద్రంగా 2000 సంవత్సరంలో యూనిట్ బ్యాంకుగా ప్రారంభమైన గాయత్రి బ్యాంకు, వినియోగదారులకు పారదర్శకమైన, సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ నేడు రూ. 3858.29 కోట్ల వ్యాపారం సాధించి మల్టీస్టేట్ బ్యాంకుగా ఎదిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 68 శాఖలు, 8,76,581 మంది వినియోగదారులతో తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు.
మధిర ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
మధిర మాజీ చైర్మన్ శ్రీ రంగ హనుమంత రావు మాట్లాడుతూ, గాయత్రి బ్యాంకు మధిరలో శాఖ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, యూపీఐ, ఏటీఎం, ఆర్టీజీఎస్ సేవలతో పాటు, నిరక్షరాస్యుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సేవలు, ఖాతాదారులకు ఉచిత ఫోటో, జిరాక్స్ సౌకర్యాలు వినియోగదారుల ఆదరణ పొందుతాయని తెలిపారు.
నిర్భయ సేవింగ్ ఖాతాతో ప్రమాద భీమా
డా. వాసిరెడ్డి రామనాధం మాట్లాడుతూ, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా రూ.2 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నారని, వర్తకులు, వ్యాపారులు, ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందని చెప్పారు.
హిడెన్ చార్జీలు లేవు – పేద, మధ్యతరగతి ప్రజల కోసం సేవలు
బ్యాంకు రీజనల్ హెడ్ శ్రీనివాసులు మాట్లాడుతూ, బ్యాంకు సేవలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, కేవలం రూ.1000 బ్యాలెన్స్‌తో కరెంటు ఖాతా తక్షణమే ప్రారంభిస్తామని తెలిపారు. ఎలాంటి హిడెన్ చార్జీలు లేకుండా పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా బ్యాంకు పనిచేస్తోందని, అన్ని రకాల రుణాలు సత్వరంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
సబ్సిడీలు, పెన్షన్లు, రుణ సౌకర్యాలు
బ్రాంచ్ హెడ్ కె. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, ఆధార్ ఆధారిత నగదు బదిలీ ద్వారా సబ్సిడీలు, ప్రభుత్వ పెన్షన్లు పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలు, రైతులు–వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఋణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు, వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News