E-PAPER

రంజాన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయం

మణుగూరు, డిసెంబర్ 22 :
మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలోని మసీదులో రంజాన్ షెడ్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక ఐక్యత, మతసౌహార్దం, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఈ షెడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ITDA EE మధుకర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News