మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలో పూసల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్పల సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గోరంట్ల కనకయ్యను పూసల కులస్తులు శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ బుర్ర సోమేశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ బీసీల విజయాలు రాజ్యాధికారానికి తొలి అడుగని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం అన్ని బీసీ కులాలు ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్య మాట్లాడుతూ పూసల కుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, పూసల సంఘం భవనానికి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పూసల కుల జిల్లా, మండల నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—
✍️ పులిపాటి పాపారావు | జర్నలిస్ట్









