Y7 న్యూస్ | మణుగూరు
నేటితరం కాంగ్రెస్ యువజన నాయకులలో ఒకరైన మణుగూరు కు చెందిన గాండ్ల సురేష్ సమితి సింగారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్ననాటి నుంచే వామపక్ష విద్యార్థి సంఘమైన AISFలో క్రియాశీలకంగా పనిచేస్తూ, నాటి AISF జిల్లా నాయకులు పాయం వెంకటేశ్వర్లు అడుగుజాడల్లో మణుగూరు కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలను ముందుకు నడిపిన సురేష్, మణుగూరు నుంచి భద్రాచలం డిగ్రీ కాలేజ్ వరకు విద్యార్థుల హక్కుల కోసం నిరంతర పోరాటాలు నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన ఆయన, మున్నూరు కాపు సంఘం మణుగూరు అగ్ర నాయకుడిగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈరోజు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులతో సమితి సింగారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న గాండ్ల సురేష్‌కు మణుగూరు మిత్రులు, శ్రేయోభిలాషులు, పూర్వ విద్యార్థి సంఘాల సహచరులు అభినందనలు తెలియజేస్తున్నారు.
విద్యావంతుడిగా, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విధానాలను ప్రజల చెంతకు తీసుకెళ్లడంతో పాటు, సమితి సింగారం గ్రామపంచాయతీని జిల్లాకే తలమానికంగా నిలిపేలా పారదర్శక పాలన అందించాలని వారు ఆకాంక్షించారు.









