E-PAPER

కొత్తగూడెంలో TUCI కార్మిక శిక్షణ తరగతుల ఆరంభం

కొత్తగూడెం, నవంబర్ 27 (Y7 NEWS):
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెం ఉర్దూగర్లో కార్మిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణల్లో ముఖ్యంగా కార్మిక చట్టాలు, లేబర్ కోడ్స్, గెజిట్ ముద్రణ వంటి అంశాలను రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కే. సూర్యం బోధించారు.

కాగా CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కేచ్చల రంగారెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. శిక్షణ తరగతులకు ముందుగా జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఏదులపురం గోపాలరావు, సహకార దర్శి నుపా భాస్కర్, జిల్లా నాయకులు ఎం. చంద్రశేఖర్, రాజశేఖర్ మల్లెల, వెంకటేశ్వర్లు, బి. మల్సూర్, రాజశేఖర్, వేల్పుల రమేష్, వేముల గురునాథం, జరుపల సుందర్, మిట్టపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News