E-PAPER

డీఎస్సీ అక్రమాలపై సిబిఐతో విచారణ చేయాలని నిరాహార దీక్ష

రంపచోడవరంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

పోలవరం ( వై7 న్యూస్) ఆగస్టు 06: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రంపచోడవరం అంబేద్కర్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మరియు రంపచోడవరం నియోజవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల గడుస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని ఇప్పటివరకు ప్రతి నిరుద్యోగి 78,000 చొప్పున బకాయి డబ్బులు ఇవ్వాలని, మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ తీసి ఉద్యోగాలు అమ్ముకున్నారని, డీఎస్సీపై జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపి బాధ్యులైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు,మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా, నియోజకవర్గ మండల వివిధ హోదాలో ఉన్న నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Fb frame title

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!