ఇంద్రవెల్లి ;
ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామపంచాయతి రాష్ట్రంలో తొలి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను నమోదు చేసింది. గ్రామ సర్వసమ్మతితో సర్పంచ్ పదవి నుండి వార్డు సభ్యుల వరకు మొత్తం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
గ్రామంలోని సాలెగుడా, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పటేల్‌ల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో, గ్రామ పెద్దల ఏకాభిప్రాయంతో కోవా రాజేశ్వర్ను సర్పంచ్‌గా ఎంపిక చేశారు. అలాగే పంచాయతీకి చెందిన 8 మంది వార్డు సభ్యులూ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.
ఎన్నికలు లేకుండా పరస్పర సహకారం, ఐక్యతతోనే ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేసిన తేజపూర్ గ్రామం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది.
Post Views: 254









