దుమ్ముగూడెం , ఆగస్ట్ 06 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కేశపట్నం సమీపంలోని చిన్న నల్లబల్లి వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు దూరంగా పార్క్ చేసి ఉంచిన కొత్త ఆటోను ఇసుక లోడింగ్‌కు వెళ్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
స్థానికుల కథనం ప్రకారం, లారీ డ్రైవర్ విపరీతమైన మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. లేకపోతే తీవ్ర విషాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Post Views: 62








