అశ్వాపురం, జులై 04 వై 7 న్యూస్;
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో గ్రామ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించనున్న విస్తృత స్థాయి “జై బాపు… జై భీమ్… జై సంవిధాన్” కార్యక్రమానికి అశ్వాపురం మండల పరిధిలోని పలువురు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలివెళ్తున్నారు.
ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య నేతృత్వం వహిస్తున్నారు. ఆయన పిలుపుమేరకు మండలంలోని పలు గ్రామాల నుండి పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తున్న ముఖ్య నాయకులు బస్సుల ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు.గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి, నాయకత్వ పరంగా క్రమశిక్షణకు, పునర్నిర్మాణ ధ్యేయంతో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని నాయకులు తెలిపారు.
Post Views: 93