హైదరాబాద్;
ఆక్స్ ఫర్డ్ హై స్కూల్ ఆధ్వర్యంలో 2026 వార్షికోత్సవ వేడుకలు ఆర్‌సీ పురం శ్రీ బాలాజీ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ, సాధనలు, సృజనాత్మకతను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు అందరినీ అలరించాయి. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆనందంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఇక్రిశాట్ శాస్త్రవేత్త శోభన్ బాబు కూడా కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఛైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.








