E-PAPER

మొండికుంటలో విషాదం

అశ్వాపురం:

అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22), ఎస్టీ కోయ యువకుడు, ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన జయంత్, ఒంటరితనాన్ని భరించలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జయంత్ తండ్రి బాలరాజు గతంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందగా, తల్లి కూడా అతడిని వదిలి వెళ్లిపోవడంతో ఆయన తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మొండికుంట గ్రామ శివారులోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై అతని బాబాయి సున్నం సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News