అశ్వాపురం ;
అశ్వాపురం మండలంలోని బస్టాండ్ సెంటర్‌లో సి.ఐ. యల్లయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు, క్రైమ్ నియంత్రణ, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. “మీ భద్రతే మీ కుటుంబ భద్రత” అని సి.ఐ. యల్లయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మూడు ఆటో యూనియన్లకు చెందిన డ్రైవర్లు పాల్గొన్నారు.
Post Views: 21








