E-PAPER

కళ్లల్లో కారం కొట్టి బంగారం దోపిడీ – నందిగామలో సంచలనం

వై7 న్యూస్ పలాస

పలాస పరిధిలోని నందిగామ మండలం నర్సిపురం గ్రామంలో ఆదివారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నెయ్యల మహాలక్ష్మి అనే మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ మరియు పుస్తెలతాడు దొంగల బారిన పడ్డాయి.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, స్నానం కోసం గ్రామ శివారు చెరువుకు వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అడ్డగించారు. అనంతరం కళ్లల్లో కారం కొట్టి, మెడలో ఉన్న చైన్ మరియు పుస్తెలతాడు తెంపుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పార్వతీశం ఫిర్యాదు చేయగా, నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రామంలో భయాందోళనలు ఈ సంఘటనతో నర్సిపురం గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం వేళల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News