కాశీబుగ్గ: కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ షాబాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని హరీష్ కుమార్ గుప్త ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టులో డబ్ల్యూఏ నంబర్ 274/2024 కేసులో వచ్చిన ఆదేశాల అమలు భాగంగా, సంబంధిత సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే, ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 35








