E-PAPER

బయ్యారం–మణుగూరు రహదారి మరమ్మతులకు ₹50 లక్షలు

మణుగూరు;
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో బయ్యారం క్రాస్ రోడ్డు నుండి మణుగూరు వరకు ఉన్న బీటీ రహదారి మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రహదారి వర్షాల కారణంగా గుంతలతో దెబ్బతినడంతో, రోజూ లారీలు మరియు ఇతర వాహనాలతో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వెంటనే R&B అధికారులను అప్రమత్తం చేసి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.50 లక్షలను మంజూరు చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ రోజు దమ్మక్కపేట పంచాయతీ బిటిపీఎస్ సమీపంలో జరుగుతున్న రహదారి మరమ్మత్తు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీరినాకి నవీన్ R&B అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే పనులు చేపట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మండల ప్రజల తరఫున ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: మాజీ సర్పంచ్ కుర్సం రాంబాబు, సొసైటీ మాజీ డైరెక్టర్ గుండగని నాగేశ్వరావు, తమ్మీశెట్టి సాంబ, గుమ్మల వెంకటేశ్వర్లు, పాయం ప్రవీణ్, పెదబోయినా ఈశ్వర్, చీడెం పగడయ్య, తంత్రపల్లి నవీన్, కేతినేని రాజేష్, బట్ట వినయ్, మాటూరి నవీన్, బట్ట శ్రీనివాస్, పుల్లయ్య, రాము, రాజేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News