E-PAPER

దాబా హోటల్ యాజమానులతో డిఎస్పి నరేంద్ర గౌడ్ బేటీ

తూప్రాన్ జూన్ 3 వై 7 న్యూస్

పట్టణం లోని హోటల్, ధాబా యాజమానులతో తూప్రాన్ డిఎస్పి నరెందర్ గౌడ్ సమావేశం చేయడం జరిగింది. లింగారెడ్డి ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో తూప్రాన్, మనోహరబాద్, నర్సాపూర్, వెల్దుర్తి, రామాయంపేట , నార్సింగి,శివంపేట్, నుండి పోలీస్ సి.ఐ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో డిఎస్పి మాట్లాడుతూ హోటల్, ధాబా యజమానులు అందరు మద్యం సిట్టింగులు పెట్టరాదని మరియుసీసీ కెమెరలను అమర్చుకోవాలి. చుట్టూ ప్రక్కల ప్రాంతాలను స్పష్టంగా కనిపించేలా కెమెరాలను అమర్చాలని ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరా సహాయంతో నిందుతులను పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దాబాలు, హోటల్, పాన్ షాప్లు,టీ పాయింట్, అన్ని వ్యాపార దుకాణాలు రాత్రి 11 :30 గంటలకు మోసివేయాలని 12 గంటల తర్వాత ఎవరైనా తిరిచి ఉంచ్చితే వారిపై పోలీస్ యాక్ట్ చట్టపరమైన చర్యలు, వ్యాపార యాజమాన్యంపై కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు అలాగే ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారిని ఆసుపత్రికి తరలించి తమ వంతు సహాయం చేయాలని ఎలాంటి భయభ్రాంతులకు గురికా వద్దని అలా చేర్పించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం నుండి 5 వేల రూపాయల రివార్డు మరియు పోలీస్ శాఖ ద్వారా అభినందనలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన దాభాలు,హోటల్, టీ పాయింట్ యజమానులతో పోలీస్ అధికారులు సమస్యలను తెలుసుకొని డీఎస్పీ నారెందర్ గౌడ్ ప్యాపారులకి నిబంధనలు పాటించాలని పోలీస్ లకు అందరు సహకరించాలని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ లోని సిఐలు,ఎస్సైలు, హోటల్ దాబాల యజమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :