E-PAPER

జై స్వరాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడుగా బి.గోపాల్ రెడ్డి

కర్నూలు జులై 02 వై 7 న్యూస్;

జై స్వరాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడుగా బి. గోపాల్ రెడ్డిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ బుధవారం నియమించారు. విస్తృత రాజకీయ అనుభవం ఉన్న గోపాల్ రెడ్డి జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. రైతులు, యువకులు, మహిళలు, మేధావులు, వివిధ ఉద్యమకారులు జై స్వరాజ్ పార్టీలో చేరుతున్నట్లు, గ్రామ స్వరాజ్యం, పేదలు లేని సమాజ నిర్మాణం, అందరికీ, విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వివక్ష లేని వ్యవస్థ కోసం జై స్వరాజ్ పార్టీ పని చేస్తోందని కేఎస్ఆర్ గౌడ పేర్కొన్నారు. తనకు జై స్వరాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ వారణాసి మురళి కృష్ణ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మునీంద్రా బాబు తదితరులకు గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :