మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగూడెం గ్రామంలో ఆదివారం రోజు మినీ మేడారం సమ్మక్క–సారక్క గద్దల వద్ద భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో కొంతమంది భక్తులు తల్లులను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
గద్దల పరిసరాలు ప్రశాంతంగా ఉండగా, భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా భక్తి వాతావరణం నెలకొంది.
– పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
Post Views: 20








