హైదరాబాద్ జూన్ 26 వై 7 న్యూస్;
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా గాంధీభవన్ లో నియామకపత్రం అందుకున్న అనంతరం నాగా సీతారాములు రోడ్లు,భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు యువజన సేవల మంత్రి వాకాటి శ్రీహరి లను వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు నాగా సీతారాములుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కార్యకర్తల అభిష్టాన్ని పరిగణలోకి తీసుకుని, పార్టీ కోసం కష్టపడ్డ వారిని అధిష్టానం గుర్తించి మంచి హోదా కల్పిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
Post Views: 89









