పాల్వంచ జాన్ 26 వై 7 న్యూస్;
పాల్వంచ మండలంలోని గుడిపాడు ప్రభుత్వ ఆసుపత్రిని జీఎస్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు అరేం ప్రశాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ప్రతాప్‌తో సమావేశమై వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నుంచి అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో మెడికల్ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.
గుడిపాడు, పెటచేరువు, కొత్తూరు, పిల్లవాగు, పెద్ద బంగారు జాలు, చిన్న బంగారు జాలు గ్రామాలకు సేవలందించే ఈ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డాక్టర్‌ను కోరారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది చురుకైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్టు