పి.వై.ఎల్. జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ ఆవేదన
భద్రాచలం, జూన్ 26 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాల్లో గంజాయి, నాటుసారా, మద్యం వినియోగం ఆహ్లాదకర స్థాయిని దాటి యువత మేధస్సును మింగేస్తోందని పి.వై.ఎల్. జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని, పోలీసుల నిర్లక్ష్యంతో నేరాలు పెరిగాయని విమర్శించారు.
పాఠశాలలు, కాలేజీల దగ్గరే మత్తు పదార్థాలు అందుబాటులో ఉండటంతో విద్యార్థులు బానిసలవుతున్నారని, యువత చిన్న వయసులోనే కుటుంబాలను నాశనం చేస్తోందన్నారు. మహిళలకు రక్షణ లేదని, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, ఎన్‌కౌంటర్ల దాకా జరుగుతోందన్నారు. తక్షణమే మత్తు మాఫియాను అరికట్టాలని, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పివైఎల్ డిమాండ్ చేసింది.
✍️ పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
Post Views: 44