కూనవరం సర్పంచ్ ఏనిక శ్వేతా బాలకృష్ణ ప్రశంస
మణుగూరు, జనవరి 30:
భరోసా వెల్ఫేర్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకమని కూనవరం సర్పంచ్ ఏనిక శ్వేతా బాలకృష్ణ ప్రశంసించారు. కూనవరం పంచాయతీ పరిధిలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన రేగులగండిలో భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వంద మంది ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఏనిక శ్వేతా బాలకృష్ణ ముఖ్య అతిథిగా, పీకేఓసి రక్షణ అధికారి, భరోసా వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు ఎం. లింగబాబు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎం. లింగబాబు గారి మార్గదర్శకత్వంలో, భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి. అమీనుద్దీన్ నేతృత్వంలో దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోని నిరుపేదలు, అనాథలకు కష్టకాలంలో గొప్ప భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామస్తులతో కొద్దిసేపు మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి. అమీనుద్దీన్, సింగరేణి సేవా సమితి సభ్యులు యస్.డి. నాసర్ పాషా, ఏనిక బాలకృష్ణ, శనిగరపు అనిల్ కుమార్, సామాజిక కార్యకర్తలు లీల, నాగుల జ్యోతి, లియాకత్ అలీ, రేగులగండి గ్రామస్తులు గుండి భీమా, వార్డు సభ్యులు గుండి దేవా, కారం భీమా, జోగయ్య, రమేష్, కుంజాదేవి తదితరులు పాల్గొన్నారు.








