వై7 న్యూస్ | పలాస
శుక్రవారం ఉదయ్మం మందస మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి నల్లబొడ్లూరు కొండ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అక్రమ దోపిడీ, సహజ వనరుల దుర్వినియోగంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ శ్రీకాంత్‌కు ఆదేశించారు. ప్రభుత్వ భూములు, కొండలు ప్రజల సంపదని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.
Post Views: 34








