వై7 న్యూస్ | పలాస
పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీష ఆదేశాల మేరకు, ఈ రోజు ఉదయం కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, నిర్వహణ విధానం, పరిశుభ్రతపై అధికారులతో పాటు స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ భోజనం వేడివేడిగా, నాణ్యంగా అందుతోందని, సేవలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. క్యాంటీన్‌లో అవసరమైన వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు.
Post Views: 11









