E-PAPER

మావోయిస్టులు వద్దు… ఆదివాసులు ముద్దు! కరకగూడెంలో పోలీసుల విస్తృత ప్రచారం

కరకగూడెం జూన్ 26 వై 7 న్యూస్;

పినపాక మండలంలోని కరకగూడెం ప్రాంతంలో వలస గిరిజన గ్రామాలలో “మావోయిస్టులు వద్దు, ఆదివాసులు ముద్దు” అనే సందేశంతో పెద్ద ఎత్తున వాల్ పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు పోలీసులు. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక సీఐ వెంకటేశ్వర్లు మరియు ఎస్సై నాగేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు.

మావోయిస్టుల అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రావాలన్న దృష్టితో పోలీసులు ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. వలస గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుంటూ, పోలీసు వ్యవస్థ స్నేహపూర్వకంగా వారిని అభివృద్ధి దిశగా నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలవుతోంది.

వాల్పోస్టర్ల ద్వారా నక్సలైట్స్ తీరును బహిర్గతం చేస్తూ, ప్రభుత్వ పథకాలను పొందే మార్గాలను కూడా వివరించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్న పోలీసులు, ఆదివాసీల హక్కులు, భద్రతలపై నడచుకోవాల్సిన మార్గాలపై అవగాహన కలిగిస్తున్నారు.

పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :