హైదరాబాద్, జూన్ 26 వై 7 న్యూస్ ;
హైదరాబాద్‌లో జూలై 24న జరిగే భవన నిర్మాణ, అసంఘటిత కార్మికుల మహాధర్నాకు జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జేఎస్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజ. గణేష్ ఆధ్వర్యంలో మౌలాలి హౌసింగ్ బోర్డు, ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంచి కార్మికుల్ని మద్దతు తెలపాలని కోరారు.
వృద్ధులకు లేబర్ కార్డులు కొనసాగించాలి, నెలకు రూ.5000 పింఛన్, నెలకు కనీసం 10 రోజుల పని, ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా వంటి డిమాండ్లతో ధర్నా జరగనుంది. మౌలాలి పెయింటర్స్ అసోసియేషన్ సహా అనేక కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Post Views: 137









