E-PAPER

మణుగూరులో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ – న్యాయమూర్తులు, పోలీసుల ముందడుగు

మణుగూరు, జూన్ 26, వై 7 న్యూస్;
పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు మణుగూరు పట్టణంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు కోర్ట్ జడ్జి కంబపు సూరి రెడ్డి, స్థానిక న్యాయవాదుల సంఘం సభ్యులు, మణుగూరు డీఎస్పీ వి. రవీంద్రరెడ్డి, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై పాదయాత్ర నిర్వహించి, “డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడదాం – యువతను కాపాడదాం” అనే నినాదాలతో ప్రజలకు చైతన్యాన్ని కల్పించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్ వంటి ప్రజాభారీగా గుమిగూడే ప్రదేశాల్లో స్టిక్కర్లు, ప్లకార్డులతో డ్రగ్స్ ఉపయోగం వల్ల కలిగే హానికర పరిణామాలపై వివరించారు.

ఈ సందర్భంగా జడ్జి కంబపు సూరి రెడ్డి మాట్లాడుతూ..

ఇప్పుడున్న యువతే రేపటి భారత భవిష్యత్తు. వారు మత్తుపదార్థాలకు బలవ్వకుండా, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. గంజాయి, డ్రగ్స్ వినియోగం ఒక్క వ్యక్తికే కాదు, కుటుంబానికీ, సమాజానికీ హానికరం. అందుకే అందరూ కలిసికట్టుగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి” అని పేర్కొన్నారు.

డీఎస్పీ వి. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ..

డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై నిఘా కొనసాగుతుంది. యువతను మాయ చేసి మత్తుపదార్థాలకు ఆరాటపడేలా చేస్తూ భవిష్యత్తు నాశనం చేస్తున్న డ్రగ్ మాఫియాపై శక్తివంతమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా అపరిచితుల నుంచి ఎలాంటి పదార్థాలూ స్వీకరించకూడదని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని” సూచించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, సివిల్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

✍🏻 పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!