అశ్వాపురం, జూన్ 26, వై 7 న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలను జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు పినపాక మాజీ శాసన సభ్యులు రేగ కాంతారావు పరామర్శించారు. యువజన నాయకుడు ఎం.డి. జావీద్ తల్లి ఎం.డి. రైమున్నిసా భేగం అనారోగ్యంతో పరమపదించారు అనే విషయాన్ని తెలుసుకొని, వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. అదే గ్రామంలో ఎస్టీ కాలనీలో నివసించే పరిస్కా భద్రమ్మ మరణించగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మల్లెలమడుగు గ్రామానికి చెందిన సురకంటి వెంకటరమణా రెడ్డి మరణవార్త తెలుసుకొని, అక్కడికి వెళ్లి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సాంత్వన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్ పాల్గొన్నారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్









